Vijayasai Reddy : మద్యం స్కాంపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్

ఏపీ పాలిటిక్స్ లో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ సంచలనం రేపుతోంది. మద్యం కుంభకోణంలో తన పాత్ర విజిల్ బ్లోయర్‌లాంటిదని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు.. దొరకని దొంగలు తన పేరుని లాగుతున్నారని... ఏ రూపాయీ తాను ముట్టలేదన్నారు. లిక్కర్ దొంగల దుస్తులు సగమే విప్పారని... వారి మిగతా దుస్తులు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తాను అంటూ విజయసాయిరెడ్డి పోస్టు పెట్టారు.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి, సూత్రధారి కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డేనని ఇటీవల విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం కేసి రెడ్డిని సిట్ విచారిస్తున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు లిక్కర్ కేసులో తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది. బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్ పేరు వినిపిస్తోంది. రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా సుధీర్ ఉన్నారు. బాలం సుధీర్ కు కసిరెడ్డి రూ.50 కోట్ల అందించినట్లు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com