AP: ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. పంటపొలాలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. విజయవాడ జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. వరద బాధితులను ఆదుకోవాడానికి సీఎం చంద్రబాబు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వరదలతో అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వారం రోజులుగా అటు వరదలు, ఇటు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరై నగరవాసులు బయటకు వస్తున్నారు. వర్షాలు కాస్త తెరిపివ్వడంతో సహాయక చర్యలు వేగంగా సాగాయి. వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహించారు. మరోవైపు ధ్వంసమైన ప్రకాశం బ్యారేజీ గేట్ల స్థానంలో కొత్తవాటిని బిగించింది. ఇందుకోసం కన్నయ్య నాయుడిని రంగంలోకి దించింది.
బురద జల్లుతున్నారు
జగన్ ఎక్కడో బెంగళూరులో ఉండి ఇక్కడి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ముంపు బాధితుల్ని ఆదుకోకపోగా నీచరాజకీయాలు చేస్తున్నారు. వాళ్లే నేరాలు, ఘోరాలు చేసి ఇతరుల పైకి నెడుతున్నారన్నారు. సాక్షి పత్రికలో విషం కక్కుతున్నారని... సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులు పెడుతున్నారని అన్నారు. మోసం చేయాలని కుట్రలు పన్నుతున్నారన్న చంద్రబాబు.. తాము ప్రజలందరికీ న్యాయం చేయాలని చూస్తుంటే, వారికి అన్యాయం చేయడానికి జగన్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బుడమేరుకు పడ్డ గండ్లను వైసీపీ ప్రభుత్వం పూడ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇందుకు సిగ్గుపడాల్సిన పార్టీ ఎదురుదాడి చేస్తోందన్నారు. స్థానికంగా కొందరు కాలువలను, డ్రైయిన్లను కబ్జాచేశారని... బుడమేరును పూర్తిగా ఆక్రమించారని.... అక్రమకట్టడాలు నిర్మించారని.... రిజిస్ట్రేషన్లు చేసి అమ్ముకున్నారని చంద్రబాబు అన్నారు. దీంతో వరద నీరు పోయే పరిస్థితి లేదన్నారు. వరదల రూపంలో ప్రజలకు ఊహించని కష్టం వచ్చిందదన్నారు.
వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అన్యాయం చేయడానికి జగన్ చేయని కుట్ర లేదంటూ మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగించడమే వారి ఉద్దేశమని.. అందుకే వైసీపీ నేతలే కుట్రపూరితంగా కృష్ణా నదిలోకి ఐదు బోట్లు వదిలారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ రంగులున్న ఆ పడవలను కావాలనే లంగర్లు వేయకుండా వదిలేశారని మండిపడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com