Floods in Vijayawada : నిండా మునిగిన విజయవాడ.. మాటల్లో వర్ణించలేం

Floods in Vijayawada : నిండా మునిగిన విజయవాడ.. మాటల్లో వర్ణించలేం
X

భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినా విజయవాడను వరద చుట్టుముట్టేస్తుంది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ మూడు అడుగుల లోతులో జలమయమయ్యాయి. విజయవాడలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురిసింది. ఒకే రోజు 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శుక్ర, శనివారాల్లో విజయవాడ మహానగరంలో కుండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో 4 అడుగుల మేర నీరు నిలిచింది.

ఆటోనగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు వరద నీరు భారీగా రహదా రిపైకి వచ్చి చేరింది. ఆదివారం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. అదేవిధంగా బుడమేరుకు వరద పోటెత్తింది. దీంతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. బుడమేరు వాగు పొంగి ప్రవహించడంతో నగరంలోని 16 డివిజన్లను వరద నీరు అన్ని ప్రాంతాలను ముంచెత్తింది. విద్యాధరపురం, పాల ప్రాజెక్టు, చిట్టినగర్, రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్ లోని కాలనీ ల్లోని రహదారులు, నివాసాల్లోకి భారీగా వరద నీరు ప్రవేశించింది.

ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆయా ప్రాంతాలకు వరద చేరుతూ మధ్యాహ్నానికి వేలాది గృహాల్లోకి వరదనీరు ప్రవేశించింది. ఏ ఇంటిని చూసినా వరద నీటిలోనే మునిగి కని పిస్తోంది. అదేవిధంగా ఆయా ప్రాంతాలను వరద చుట్టేయడం, పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలమట్టం కావడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో విజయ వాడ నగరంలోని 12 డివిజన్లు అంధకారంలో ఉన్నాయి. ఓ వైపు వరదనీరు.. మరోవైపు కరెంట్ లేకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. బుడమేరుకు పెద్ద ఎత్తున వరద వస్తుం డడంతో ఆయా ప్రాంతాల్లో 1.50 లక్షల హెక్టార్లల్లో వరి పంట, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

Tags

Next Story