ఎంపీ మోపిదేవిని అడ్డుకున్న గ్రామస్తులు

ఎంపీ మోపిదేవిని అడ్డుకున్న గ్రామస్తులు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను మహిళలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. ఊళ్లోకి వెళ్లనిచ్చేది లేదని గ్రామశివారులోనే నిలిపివేశారు.

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపల్లెలో ఉద్రిక్తత నెలకొంది.వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను మహిళలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. ఊళ్లోకి వెళ్లనిచ్చేది లేదని గ్రామశివారులోనే నిలిపివేశారు.నిన్న 15ఏళ్ల బాలుడు అమర్నాథ్‌కు ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. తీవ్ర గాయాలపాలైన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బాలుడిని చంపిన ఆ ముగ్గురిని కఠినంగా శిక్షించాలంటూ మహిళలు, స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోకి రాకుండా ఎంపీ మోపిదేవిని అడ్డుకున్నారు. బాలుడ్ని చంపిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

గ్రామస్తుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ఎంపీ మోపిదేవి వారితో చర్చలు జరుపుతున్నారు. అటు బాలుడి కుటుంబానికి తెలుగుదేశం నేతలు అండగా నిలిచారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. దీంతో ముందస్తుగా గ్రామంలో పోలీసులను మోహరించారు.


Tags

Next Story