Nara Lokesh Yuvagalam : వనికుంట గ్రామస్తులకు నారా లోకేష్ భరోసా

వినుకొండ నియోజకవర్గం వనికుంట గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు
అమరావతి, 2023 ఆగస్టు 5: వినుకొండ నియోజకవర్గం వనికుంట గ్రామస్తులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఫ్లోరిన్ సమస్య వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, నాలుగేళ్లుగా మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు కానీ పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, అప్పులతో పిల్లల్ని చదివించుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.
వినతిపత్రాన్ని అందుకున్న నారా లోకేష్, జగన్ అండ్ కోకు దోచుకోవడం, దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని, ప్రజల దాహార్తి తీర్చేందుకు కేంద్రం నిధులిచ్చినా వాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది అని, జల్ జీవన్ మిషన్ అమలులో ఎపి 18వ స్థానంలో ఉండటమే ఇందుకు నిదర్శనం అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తామని, పంచాయితీల నిధులను పక్కదారి పట్టించడంతో పంచాయితీల పరిస్థితి దుర్భరంగా మారింది, వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అప్పుల్లో ఎపి రైతులు మొదటిస్థానంలో నిలచారు, టిడిపి అధికారంలోకి రాగానే గ్రామసీమలకు అదనపు నిధులు ఇచ్చి గత వైభవం కల్పిస్తామని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి, అన్నదాతలకు అండగా నిలుస్తామని నారా లోకేష్ అన్నారు , టీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని భరోసా ఇచ్చారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com