విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగి సూసైడ్ నోట్ కలకలం..!

విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగి సూసైడ్ నోట్ కలకలం..!
కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం.. ఇవాళ జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఓ మైలురాయి కావాలని లేఖలో పేర్కొన్నాడు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం.. ఇవాళ జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఓ మైలురాయి కావాలని లేఖలో పేర్కొన్నాడు. 32 మంది ప్రాణాల త్యాగాల ప్రతిఫలం విశాఖ ఉక్కు కర్మాగారమని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వదని కోరాడు.

నా ప్రాణాన్ని ఉక్కు ప్రైవేటీకరణ వ‌్యతిరేక ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నానన్నాడు. ఈరోజు సాయంత్రం 5గంటల 49 నిమిషాలకు అగ్నికి అహుతి కావడానికి ముహుర్తం పెట్టుకున్నానని తెలిపాడు. ఈ పోరాటం నా ప్రాణత్యాగం నుంచి మొదలుకావాలని లేఖలో తెలిపాడు. అటు.. శ్రీనివాసరావును వెతికేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.Tags

Next Story