Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీలో రహదారుల...

ఏపీలో రహదారుల దిగ్బంధనానికి బీజేపీ పిలుపు

ఏపీలో రహదారుల దిగ్బంధనానికి బీజేపీ పిలుపు
X

ఏపీలో ప్రధాన రహదారుల నిర్వహణలో వైసీపీ సర్కారు విఫలమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే నిధుల్ని వైసీపీ సర్కారు పక్కదారి పట్టిస్తోందని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ.. రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని చెప్పారు.

Next Story