ప్రభుత్వ పథకాల్లో వైసీపీ నేతల అక్రమాలు

ప్రభుత్వ పథకాల్లో వైసీపీ నేతల అక్రమాలు

ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైసీపీ నేతల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుడా పోయాయి. అనర్హులకు లబ్ధి కలిగిస్తూ.. ప్రజాధనాన్నిదుర్వినియోగం చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్టుగా దస్త్రాలు మారుస్తూ.. డబ్బులు వసూలు చేస్తున్నారు. విశాఖ జిల్లా హరిపాలెం గ్రామంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. పథకాల్లో లబ్ధి కలిగిస్తామంటూ డబ్బు వసూలు చేశారు. వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం సహా వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూర్చుతామంటూ హరిపాలెంలో వైసీపీ నేతలు... గ్రామస్థుల నుంచి లక్షా 90 వేలు వసూలు చేశారు. అక్రమాలపై పక్కా సమాచారం అందడంతో విజిలెన్స్‌ అధికారులు దుండగుల్ని అరెస్ట్‌ చేశారు.

అక్రమాల గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు.. కీలక విషయాల్ని గుర్తించారు. వైసీపీ నేతలు.. ఆధార్‌ కార్డుల్లో వివరాల్ని సైతం మార్చినట్టు తెలుసుకున్నారు. పథకాల్లో లబ్ధి కోసం అర్హత వయసును వైసీపీ నేతలు మార్చుతున్నట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. 38 మంది ఆధార్‌ కార్డుల్లో వివరాలు మార్చినట్టు గుర్తించారు. అటు.. పథకాల్లో లబ్ధిదారుల్ని సైతం విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నించారు. వైసీపీ నేతలు అప్పారావు, సురేశ్‌, సూర్యకృష్ణను అరెస్టు చేశారు.

అటు.. విజిలెన్స్‌ అధికారుల ఫిర్యాదుతో అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామ సచివాలయాన్నిపరిశీలించారు. సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. గ్రామ సచివాలయం వద్దకు పోలీసులు రావడంతో... గ్రామ సచివాలయం వద్ద జనం గుమిగూడరు. వైసీపీ నేతలకు చెల్లించిన నగదు వివరాలను పోలీసులు తెలుసుకున్నారని గ్రామ సచివాలయ అధికారులు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story