Vizianagaram: విజయనగరంలో రైతుల ఆగ్రహం.. వారు పండించిన ధాన్యాన్ని వారే..

X
Vizianagaram: పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ.. ఆ ధాన్యాన్ని తగులబెట్టారు రైతులు. ఈ ఘటన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం నాగురు గ్రామంలో జరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి కొనుగోళ్లు జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంట పొలంలో ఉండటంతో.. తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు రైతులు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా.. ఏపీ రైతు కూలీ సంఘం నేతలు, సీపీఎం నేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
