AP : కాకినాడలో వాలంటీర్ల ఆందోళన

AP : కాకినాడలో వాలంటీర్ల ఆందోళన
X

కాకినాడ జిల్లా వ్యాప్తంగా వాలంటీర్లుగా పనిచేసిన వారంతా ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే పదివేల జీతం ఇచ్చి పర్మినెంట్‌ చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆరోపించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్న వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూటమి వస్తే జీతాలు పెరుగుతాయని భావించామని, కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. తక్షణం తమ ఉద్యోగాలు తమకు ఇచ్చి ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story