CM Chandrababu : కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: సీఎం చంద్రబాబు

గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.
థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనేది తమ నినాదమని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ప్రపంచంలోని గొప్ప కంపెనీలన్నీ దావోస్‌కు వస్తుంటాయి. అక్కడికి వెళ్లడం వల్ల ప్రతినిధులను కలిసే అవకాశం వస్తుంది. మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి. సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తయారుచేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు గొప్పస్థాయిలో ఉన్నారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం’ అని అన్నారు.
విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నకు సీఎం చంద్రబాబు స్పందించారు. అది వైసీపీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారని, లేదంటే ఎవరి మార్గం వాళ్లు చూసుకుంటారని పేర్కొన్నారు. అటు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖను ఆమోదించారని విజయసాయి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com