Andhra Pradesh: అధినేతల కోసం తాడేపల్లిగూడానికి తరలివెళ్లిన తెలుగు జనం

Andhra Pradesh:  అధినేతల కోసం తాడేపల్లిగూడానికి తరలివెళ్లిన తెలుగు జనం
రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు-చంద్రబాబు, పవన్

తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు, పవన్ర్వహించిన జెండా సభకు భారీ సంఖ‌్యలో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పోటెత్తారు. ఐదేళ్ల జగన్ పాలన అట్టర్ ప్లాప్ అని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం-జనసేన కూటమి సూపర్ హిట్ అన్నారు. అగ్నికి వాయువు తోడైనట్లు తెలుగుదేశానికి పవన్‌ జనసేన తోడైందని ఇక వైకాపా బుగ్గి అవడం ఖాయమన్నారు. వైకాపా వేధింపులు తట్టుకోలేక హనుమ విహారి లాంటి ఆటగాళ్లే పారిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. సొంత చెల్లి మరో పార్టీలో చేరితే వేధించారని గుర్తుచేశారు. ఐదేళ్లలో ఏం పొడిచావని ఓటు వేయాలో జగన్‌ చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు.

తెలుగుదేశం-జనసేన కలయిక సూపర్ హిట్ అయితే జగన్ పాలన అట్టర్‌ ప్లాప్ అని దీనికి సీక్వెల్ ఉండదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేందుక జగన్ స్కెచ్‌లు వేస్తే అథోగతి పాలైన రాష్ట్రాన్ని బాగు చేసేందుకు తమ వద్ద బ్లూ ప్రింట్ ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. స్మగ్లర్లు, రౌడీలను వైకాపా అభ్యర్థులుగా నిలబెడుతోందని అలాంటివారిని గెలిపిస్తే రాష్ట్ర ప్రజలకు రక్షణ ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు.


తెలుగుదేశం-జనసేన పొత్తును విచ్చిన్నం చేసే కుట్రలు జరుగుతాయని అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఇరుపార్టీలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. కుప్పానికి నీళ్ల పేరిట జగన్ నాటకాలు ఆడారని దుయ్యబట్టారు. జగన్‌కు తల్లి, చెల్లి అన్న విచక్షణ కూడా లేదని..సొంత ఇంటి మహిళలపైనే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ కల్యాణ్‌తో జట్టు కట్టామని తెలిపారు.

జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై దాడి చేస్తే మక్కెలు ఇరగ్గొడతామని పవన్‌ వైకాపాను హెచ్చరించారు. జగన్‌ను అధఃపాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కల్యాణ్ కాదని జనసేనాని ఉద్ఘాటించారు. మినీయుద్ధాలన్నీ కలిసి మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నానని చెప్పిన పవన్‌..మద్దతుదారుల పేరుతో సీట్లు, పొత్తులపై తన వ్యూహాన్నిప్రశ్నించవద్దన్నారు. తనతో కలిసి నడిచేవారే తనకు నిజమైన మద్దతుదారులని స్పష్టంచేశారు.


Tags

Read MoreRead Less
Next Story