BJP:కూటమి పాలనలో అనేక సిక్సర్లు కొట్టాం.బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

ఏపీ కూటమి పాలనలో సూపర్ సిక్స్ హామీలే కాకుండా అనేక ఇతర రంగాల్లో కూడా సిక్సర్లు కొట్టామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్... సూపర్ హిట్ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని మాధవ్ తెలిపారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని ఆయన వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పోలవరం ప్రాజెక్టు కేవలం రెండేళ్లలో పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పెట్టుబడులు, ఉపాధి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రూ.9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని మాధవ్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ హబ్ గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com