AP Job Unions : ఈ నెల 9న విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాం: ఏపీ ఉద్యోగ సంఘాలు

AP Job Unions : పీఆర్సీపై భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి ఏపీ ఉద్యోగ సంఘాలు. ఈ నెల 9న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు. ప్రభుత్వం ఒక్క సమస్యకు కూడా పరిష్కారం చూపలేకపోయిందన్నారు ఏపీ జేఏసీ నేత ఉద్యోగ సంఘాల నేతలు. సీఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉన్న జీతాలకు కోత పడే ప్రమాదం ఉందన్నారు. ఆర్థిక మంత్రి, CS ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. ప్రభుత్వంతో ఘర్షణను తాము కోరవకోవడం లేదన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వ కక్షాపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కింది స్థాయి ఉద్యోగులను అవమానించేలా చర్చలు చేస్తోందన్నారు. తాము దాచుకున్న డబ్బులు 2 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ బిల్లులు మార్చిలోగా చెల్లిస్తామనడంలో కుట్ర దాగుందన్నారు. ఎన్నికలప్పుడు సీపీఎస్ రద్దు హామీ ఇచ్చి ఇప్పుడు మాత్రం నోరు మెదపడ లేదన్నారు నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com