YSRCP : యుద్ధం ఎఫెక్ట్.. అతలాకుతలం అయిన మావిగన్ బ్యాచ్..!

YSRCP : యుద్ధం ఎఫెక్ట్.. అతలాకుతలం అయిన మావిగన్ బ్యాచ్..!
X

పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్ మామూలుగా లేదు. ఇది కాస్త అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీ మావిగన్ బ్యాచ్ కు ఇబ్బంది కరంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు దోచుకున్నారు వైసీపీ బ్యాచ్. లిక్కర్ స్కామ్, కల్తీ లిక్కర్ పేరుతో పాటు ఆయా స్కీముల్లో, ప్రాజెక్టులు, కార్యక్రమాల్లో దోచుకున్న డబ్బును మొత్తం అప్పట్లో యూకేతో పాటు మరికొన్ని దేశాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఆయా దేశాల్లో విదేశీ పెట్టుబడులపై టాక్స్ విధించడంతో తిరిగి వాటిని దుబాయ్ తో పాటు గల్ప్ దేశాల్లో పెట్టుబడులు పెట్టారు. కానీ ఇప్పుడు గల్ఫ్ దేశాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. అక్కడ హోటల్ రంగాలు, టూరిస్టు రంగం, ఇతర కంపెనీలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి.

దీంతో వైసీపీ బ్యాచ్ మొత్తం తలలు పట్టుకుంటోంది. ఇలా ఎలా జరిగిందంటూ నెత్తి, నోరు కొట్టుకుంటున్నారంట. ప్రజల సొమ్ము దోచుకుని ఆ డబ్బులతో పెట్టుబడులు పెడితే అవి కాస్తా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. దీంతో చేసేది లేక వారంతా జగన్ వద్దకు పరుగులు తీస్తున్నట్టు తెలుస్తోంది. వందల కోట్లు పెట్టుబడులు పూర్తిగా దెబ్బ తినడంతో వాటి గురించి కనీసం బయట పెట్టడానికి కూడా వారికి అవకాశం లేకుండా పోయింది.

దీంతో వైసీపీ బ్యాచ్ పూర్తిగా దిమ్మతిరిగిపోయినట్టు అవుతోంది. దీంతో ఆయా నేతలు, నాయకులు మొత్తం అటువైపే తిరుగుతున్నారంట. ఇన్ని రోజులు తాము ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందని చింతిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రజలు వాటిని క్లుప్తంగా గమనిస్తున్నారు. కూటమి నేతలు ఆ విషయాలను చూసి ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలని కోరుతున్నారు.

Tags

Next Story