- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- West Godavari Accident: పశ్చిమ...
West Godavari Accident: పశ్చిమ గోదావరి జిల్లా బస్సు ప్రమాదానికి కారణంపై అనుమానాలు..

West Godavari Accident: స్టీరింగ్ పట్టేయడం వల్లే జల్లేరు బస్సు ప్రమాదం జరిగిందా? బస్సు కండీషన్లో లేదన్నది వాస్తవమేనా? అధికారులు కారణాలు బయటపెట్టకపోవడానికి కారణాలేంటి? బస్సు ప్రమాదంపై విచారణ కొనసాగుతూనే ఉన్నప్పటికీ.. ప్రత్యక్ష సాక్షి చెబుతున్న దాని ప్రకారం అయితే.. స్టీరింగ్ తిరగకపోవడం వల్లే బస్సు జల్లేరు వాగులో పడిందని చెబుతున్నాడు.
ప్రమాదం జరిగిన బస్సులో ప్రయాణించిన మల్లిడి సోమశేఖర్ రెడ్డి.. డ్రైవర్ దగ్గరే కూర్చున్నాడు. ఆ సమయంలో స్టీరింగ్ పట్టేయడం చూశానని, చూస్తుండగానే బస్సు జల్లేరు వాగులో పడిపోయిందని సోమశేఖర్ రెడ్డి చెబుతున్నారు. ప్రమాదంలో కాలుకు తీవ్ర గాయమై జంగారెడ్డిగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గతంలో ఇదే బస్సుకు స్టీరింగ్ తిరగకపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని ఆర్టీసీ ఉద్యోగులే చెబుతున్నారు. అయినా సరే బలవంతంగా బస్సును తిప్పారని ఆరోపించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com