CM Chandrababu Naidu : కేంద్ర బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

కేంద్ర బడ్జెట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు. వార్షికాదాయం రూ.12లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం గొప్ప పరిణామం అని చెప్పారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. పేదలు, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. ఈ సందర్భంగా కేంద్రం, ఆర్థిక మంత్రి నిర్మలకు సీఎం అభినందనలు చెప్పారు.
ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 డిసెంబర్ 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్‌లో పలు కేటాయింపులు చేసింది.
* పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు
* ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157కోట్లు
* విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295కోట్లు
* విశాఖ పోర్టుకు రూ.730కోట్లు
* ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162కోట్లు
* జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు: రూ.186కోట్లు
ఏపీ ప్రజల తరఫున నిర్మలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో జల్ జీవన్ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. 2028 వరకు జల్ జీవన్ పథకం పొడిగింపుతో ఏపీకి మేలు జరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్రానికి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేస్తామన్నారు. ఎంత వీలైతే అంత రాష్ట్రానికి నిధులు తెస్తామని చెప్పారు. రాష్ట్రంలో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com