Verras Ravindra Reddy : వర్రా అరెస్ట్ కు ముందు జరిగింది వేరు..భార్య ఆవేదన

వైసీపీ నాయకుడు, తన భర్త వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్‌పై భార్య వర్రా కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను ఈనెల 11న అదుపులోకి తీసుకున్నారన్నది అవాస్తవమన్నారు. 8న కర్నూల్ టోల్‌ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారని, 12న మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని తెలిపారు. ఆ మూడు రోజుల పాటు రవీంద్రారెడ్డిని చిత్రహింసలకు గురిచేసి తప్పుడు స్టేట్‌మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. అతనికి జరిగిన అన్యాయాన్ని అందరి దృష్టికి తీసుకువస్తున్నారన్నారు వర్రా కల్యాణి. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, లోకేష్, హోంమంత్రి అనిత, వైఎస్ షర్మిల, విజయమ్మ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు ఆయనపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి పత్తికొండ కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో వర్రా రవీంద్రా రెడ్డికి ధర్మాసనం రిమాండ్ విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com