Andhra Pradesh : ఏపీలో మొంథా.. జగన్ ఎక్కడ.?

Andhra Pradesh : ఏపీలో మొంథా.. జగన్ ఎక్కడ.?
X

ఏపీని మొంథా తుఫాన్ ముంచేస్తోంది. నిన్న రాత్రి నుంచి తుఫాన్ బీభత్సం మామూలుగా లేదు. ఏపీని కకావికలం చేసేస్తోంది. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోతున్నాయి. చెట్లు విరిగిపోతున్నాయి. కరెంటు స్తంభాలు కూలిపోతున్నాయి. పంట నష్టం భారీగా జరుగుతుంది. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతిక్షణం కూటమి నేతలను, అధికారులను ప్రజల మధ్య ఉంచుతూ వాళ్లకు భరోసా ఇస్తున్నారు. భారీ స్థాయిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి హైజినిక్ ఫుడ్, సౌకర్యవంతంగా వసతులు ఏర్పాటు చేశారు. ఒక్కరి ప్రాణం కూడా పోకుండా రెస్క్యూ టీమ్స్, ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ఇలా ఏపీవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంటే.. ప్రతిపక్షంలో ఉన్న మాజీ సీఎం జగన్ ఎక్కడ అని ఏపీ ప్రజలు అడుగుతున్నారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అయినా ప్రజల మధ్య ఉండరా.. ఆయనకు కనీస బాధ్యత కూడా లేదా.. ఇలాంటి సమయంలో బెంగళూరు ప్యాలెస్ లో ఉంటారా అని ఏకిపారేస్తున్నారు ప్రజలు.

ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపత్తుల సమయంలో ప్రభుత్వానికి సపోర్టుగా ఉన్నారు. గతంలో చార్ధామ్ యాత్రికులు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉండి ప్రత్యేక ఫ్లైట్స్ పెట్టించి మరి వారిని క్షేమంగా రప్పించారు. మరి తాను సీఎం కాదు కదా ప్రతిపక్షనేత కదా అని ఎందుకు మౌనంగా ఉండిపోలేదు. అంత బాధ్యతగా వ్యవహరించారు కదా. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి సహకరించారు. ప్రజల మధ్య ఉంటూ వారికి భరోసా కల్పించారు. అంతేగాని తాను ప్రత్యక్ష నేత కదా ఎందుకు ఇవన్నీ చేయాలి అని అనుకోలేదు. మరి ఇప్పుడు జగన్ తన వైసిపి నేతలకు అలాంటి ఒక మెసేజ్ ఇవ్వచ్చు కదా. ప్రభుత్వంతో కలిసి పని చేయండి ప్రజలకు అండగా నిలబడండి అని చెప్పొచ్చు కదా.

ఇలాంటివి అస్సలు చేయరు. కానీ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అప్పుడు శవరాజకీయాలు చేయడానికి మాత్రం రెడీ అయిపోతారు. ఏపీలో ఎవరైనా చనిపోతే చాలు వెంటనే ఫ్లైట్ ఏసుకొని ఏపీలో వాలిపోతారు జగన్. ఇంకేముంది ఆ శవాల దగ్గరికి వెళ్లి కూటమి ప్రభుత్వంపై బురదజల్లేయడం చేస్తుంటారు. అంతేగాని ప్రజలకు ఆపద వచ్చినప్పుడు మాత్రం ఏపీ వైపు కన్నెత్తి చూడట్లేదు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇలాంటి విపత్తుల సమయంలో ఏపీలోనే ప్రజల మధ్య ఉంటూ వారికి భరోసా కల్పిస్తూ అన్ని వసతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మీకు మేమున్నామంటూ ప్రజలకు అండగా నిలబడుతున్నారు. కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ మాత్రం మనకు ఏ మాత్రం బాధ్యత లేదు అన్నట్టు బెంగళూరు ప్యాలెస్ లో సేద తీరుతున్నాడు. ఏపీలో ఉన్న వైసీపీ నేతలు కూడా తమకేమీ పట్టలేదు.. ఎవరైనా చనిపోతే అప్పుడు రాజకీయం చేద్దామన్నట్టు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు.

Tags

Next Story