ఎవరీ కేశినేని శ్వేత.. ఆమె హై ప్రొఫైల్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే .. !

ఎవరీ కేశినేని శ్వేత.. ఆమె హై ప్రొఫైల్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే .. !
ఇక్కడ మేయర్ పీఠం పైన అన్నీ పార్టీలు కన్నేశాయి. అందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకేసి మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటించేసింది.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షిచింది విజయవాడ నగరం... ఇక్కడ మేయర్ పీఠం పైన అన్నీ పార్టీలు కన్నేశాయి. అందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకేసి మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటించేసింది.. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె.. కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ప్రకటించారు. దీనితో ఇప్పుడు ఎవరీ కేశినేని శ్వేత? ఆమె ప్రొఫైల్ ఏంటి? అంటూ నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.

Also Read :

బంపర్ ఆఫర్ కొట్టేసిన దేత్తడి హారిక.. ఏకంగా తెలంగాణ ప్రభుత్వంలో.. !

జాక్‌‌‌పాట్ కొట్టేసింది.. వంద పెట్టి కోటి గెలిచింది..!

ట్రాఫిక్‌ జరిమానా కోసం తాళిని తాకట్టు..!

1. కేశినేని శ్వేత పూర్తి పేరు కేశినేని శ్వేతా చౌదరి. ఆమె ప్రస్తుత వయసు 25 సంవత్సరాలు.. తండ్రి పేరు కేశినేని శ్రీనివాస్, తల్లి పేరు పావని

2. కేశినేని శ్వేత విజయవాడలోని అట్కిన్ సన్ స్కూల్, వీపీ సిద్ధార్ధ, ఊటీలోని లారెన్స్ స్కూల్లో తన ప్రాధమిక విద్యను పూర్తి చేశారు.

౩. బెంగళూరులోని ది ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. అనంతరం అమెరికా అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సీలో బీఏ ఎకనామిక్స్, బీఏ సైకాలజీ చదివారు.

4. ఆఫ్రికా, ఐర్లాండ్ లాంటి దేశాలలో డెవలప్ మెంట్ ప్రాజెక్టులో పనిచేశారు. అలాగే టాటా ట్రస్ట్ క్యాన్సర్ కేర్ ప్రోగ్లామ్ లో భాగంగా అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, రాజస్ధాన్‌ రాష్ట్రాల్లో పనిచేశారు.

5. 2014 అమెరికాలోని అట్లాంటా సెనేటర్‌ ఎన్నికలలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రాట్‌ పార్టీ అభ్యర్థి హిల్లరి క్లింటన్‌ తరపున ప్రచారం కూడా నిర్వహించారు.

6.రాష్ట్ర విభజన తర్వాత 2014-2019 ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల తరపున ప్రచారం కూడా చేశారు.

7. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ లోని 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు.

Also Read :

వేడుకలో విషాదం.. అప్పగింతలే ఆమెకు ఆఖరి క్షణాలు..!

నలుగురితో లవ్.. లక్కీ డ్రాలో ఒక్కరితో పెళ్లి.. !

Tags

Read MoreRead Less
Next Story