Pawan Kalyan : కూటమి ఎందుకు కలిసుండాలో చెప్పిన పవన్..

Pawan Kalyan : కూటమి ఎందుకు కలిసుండాలో చెప్పిన పవన్..
X

ఏపీలో ఇప్పుడు పూటలు ప్రభుత్వం అత్యద్భుతమైన పరిపాలన అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అత్యంత భయంకరమైన పరిపాలన అందించిన వైసీపీని ప్రజలు దారుణంగా ఓడించారు. అప్పటినుంచి ఏపీని మళ్లీ పునర్నిర్మాణం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే కూటమిని విడదీయడానికి వైసిపి ఎన్ని కుట్రలు చేస్తుందో మనందరం చూస్తున్నాం. కులాల మధ్య చిచ్చుపెట్టి దాన్ని పార్టీలకు అంటగట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ కూటమి ఎందుకు కలిసి ఉండాలో వివరించారు. వైసిపి వల్ల ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని.. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వివరించారు. ఏ ఏ రంగంలో ఎలాంటి సంక్షోభం జరిగిందో క్లుప్తంగా పవన్ కళ్యాణ్ అందరికీ ఆధారాలతో సహా వివరించారు. కూటమి వల్ల సంక్షోభంలో కూరుకుపోయిన రంగాలను ఏ విధంగా మళ్లీ పాత పద్ధతిలోకి తీసుకు వస్తున్నారో కూడా తెలియజేశారు పవన్ కళ్యాణ్.

కూటమి విడిపోతే మళ్ళీ ఆయా రంగాలు మొత్తం కుంటు పడతాయని.. అభివృద్ధి అందని ద్రాక్ష లాగా ఏపీకే మిగులుతుంది అంటూ తెలియజేశారు డిప్యూటీ సీఎం. వైసిపి హయాంలో పెట్టుబడిదారులు మొత్తం పారిపోయారని.. ఏపీ అభివృద్ధి మొత్తం కుంటుపడిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూటమి హయాంలో ఎలాంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఏపీకి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయో కూడా ముఖ్యంగా తెలియజేశారు. కూటమీ ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలను.. ప్రజల కోసం చేస్తున్న అనేక మంచి పనులను ఆధారాలతో సహా తెలియజేశారు.

కూటమి పార్టీలు కలిసి ఉన్నంతకాలం ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. అలాగే పార్టీలు కలిసి ఉన్నంతకాలం వైసిపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని.. ఆ విషయం జగన్ కు తెలుసు కాబట్టి కూటమిని విడదీయడానికి ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నారంటూ పవన్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అక్షరాలా నిజం. జగన్ ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదు కాబట్టే.. తాను చేసిన పనులను చెప్పుకోకుండా కూటమి మధ్య చిచ్చు రాజేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు జగన్.

Tags

Next Story