మరో 3 టర్ములు కూటమి.. ఏపీకి తిరుగే ఉండదు.

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ ఐదేళ్లలో చేసే పనుల గురించి మాత్రమే ఆలోచించట్లేదు. రాబోయే మరో 20 ఏళ్ల పాటు ఏపీ అభివృద్ధి, అచంచలమైన ఎకానమీ గురించి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆలోచిస్తున్నారు. అందుకు తగ్గట్టే అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఏపీకి ఇప్పటికే తీసుకొచ్చారు. ఇంకా తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏపీలో ఇంకో మూడు టర్మ్ లు కూటమిపాలన ఉండాలని భావిస్తున్నారు. దీని వెనుక వారి ఉద్దేశం పదవులు కాదు. ఏపీ భవిష్యత్తు.
ఎందుకంటే ఒకే ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉంటే ఎంతగా అభివృద్ధి జరుగుతుందో గతంలో చంద్రబాబు నాయుడు 9 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చూసాం. ఆయన హయాంలోనే హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే ఆ అభివృద్ధి కంటిన్యూ అయింది. గత ఐదేళ్లలో విధ్వంసమైన ఏపీని కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిన పెడుతోంది. దీనికోసం అన్ని రకాలుగా ఏర్పాట్లను చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కాబట్టి ఏపీ అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగాలంటే ఈ ఐదేళ్లు మాత్రమే సరిపోవు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. పటిష్టమైన అభివృద్ధికి బలమైన పునాది ఇప్పుడే పడుతోంది. 2028 నాటికి అమరావతి పూర్తి కావాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
దీంతోపాటు మూడు ప్రాంతాలను ఒకే స్థాయిలో డెవలప్మెంట్ చేయడంతో పాటు సంక్షేమం ఆగొద్దు అంటే ఇంకో మూడు టర్మ్ లు కూటమి అధికారంలో ఉంటే ఏపీలో బలమైన అభివృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా సరే అభివృద్ధికి ఆటంకం అనేది జరగదు. టిడిపి 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉంటే అనుకున్న స్థాయిలో అభివృద్ధి పనులు చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ఏపీని సర్వనాశనం చేసింది. కాబట్టి వైసిపికి మరోసారి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఏపీని చంద్రబాబు నాయుడు కూటమి హయాంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.
Tags
- Chandrababu Naidu
- Pawan Kalyan
- Nara Lokesh
- AP coalition government
- Andhra Pradesh development
- 20-year vision
- long-term governance
- Amaravati completion 2028
- AP economy
- international investments
- regional development
- TDP-JSP alliance
- three-term plan
- reconstruction of AP
- YSRCP damage
- sustainable growth
- future roadmap
- Latest Telugu News
- TV5 News
- Andhra Pradesh News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

