YSRCP : వణికిపోతున్న వైసీపీ.. వరుస కేసులతో అక్రమాలు బట్టబయలు.

YSRCP : వణికిపోతున్న వైసీపీ.. వరుస కేసులతో అక్రమాలు బట్టబయలు.
X

వైసీపీ పార్టీ పైకి చేసేది ఒక ప్రచారం. కానీ లోలోతుల్లో చేసేది మాత్రం అవినీతి, అరాచకమే. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏ స్థాయిలో అవినీతి చేశారో మనం చూశాం. ఇప్పుడు అధికారం పోయాక వారి బాగోతాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క కేసు బయటకు తీస్తుంటే ఇంతటి దారుణాలు చేశారా అని ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. మరీ ముఖ్యంగా కల్తీ లిక్కర్ కేసులో ఇప్పటికే జోగి బ్రదర్స్ జైలుకు వెళ్లారు. కల్తీ లిక్కర్ అమ్మి ఏపీ ప్రజల అరోగ్యంతో చెలగాటం ఆడారు వైసీపీ బ్యాచ్. అందులో కీలక అంశాలు మొత్తం వెలుగులోకి వస్తున్నాయి. దాని తర్వాత మరిన్ని కేసులు కూడా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు.

ఇక తిరుమల లడ్డూ కల్తీనెయ్యి కేసు అయితే మహాపాపం అనే చెప్పాలి. అసలు నెయ్యి లేకుండానే కెమికల్ తో లక్షల లడ్డూలు తయారు చేసి భక్తులతో తినిపించారు. వాళ్ల ఆరోగ్యంతో, నమ్మకంతో చెలగాటం ఆడారు. ఒక రకంగా మహా పాపం చేశారు. ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డికి ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన్ను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అటు పరకామణి కేసులో దొంగలు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో కూడా వైసీపీ నేతలే దొరికిపోతున్నారు.

ఇంకోవైపు వివేకా హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అడ్డంగా దొరికిపోతున్నది కూడా వైసీపీ నేతలే. ఇలా వైసీపీ నేతల అరాచకాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సెంట్రల్ జైలు మొత్తం వైసీపీ నిందితులతో నిండిపోతోంది. అయినా సరే జగన్ వారికే సపోర్ట్ చేస్తారనేది జగమెరిగిన సత్యం. నేరస్తులకే టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడంతో జగన్ ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే ఈ దొంగల బ్యాచ్ కు ఆయన సపోర్ట్ చేస్తున్నారని మండిపడుతున్నారు ఏపీ ప్రజలు.


Tags

Next Story