Visakhapatnam: పెళ్లిరోజే విషాదం.. ఆర్కే బీచ్‌లో గల్లంతయిన వివాహిత..
By - Divya Reddy |26 July 2022 7:15 AM GMT
Visakhapatnam:NADకి చెందిన భార్యభర్తలు ఆర్.పి.రెడ్డి, సాయిప్రియ పెళ్లిరోజు సందర్భంగా నిన్న సాయంత్రం ఆర్కే బీచ్ వెళ్లారు
Visakhapatnam: విశాఖ ఆర్కే బీచ్‌లో వివాహిత గల్లంతైంది. NADకి చెందిన భార్యభర్తలు ఆర్.పి.రెడ్డి, సాయిప్రియ పెళ్లిరోజు సందర్భంగా నిన్న సాయంత్రం ఆర్కే బీచ్ వెళ్లారు. భార్యాభర్తలిద్దరూ సాయంత్రం 6 గంటలకు బీచ్ ఒడ్డునే ఉన్నారు. ఇంతలో మెసేజ్ రావడంతో ఫోన్ చూసుకుంటూ ఉండిపోయాడు ఆర్.పి.రెడ్డి. ఆ తరువాత బీచ్ దగ్గర చూస్తే.. సాయిప్రియ కనిపించలేదు. బీచ్‌లో చుట్టుపక్కల వాళ్లని అడిగినా.. ఎవరికీ తెలియదని చెప్పడంతో కెరటాల్లో కొట్టుకుపోయిందని అనుమానించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సాయిప్రియ కోసం నేవీ అధికారులు హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com