25 Nov 2020 5:10 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీలో పిల్లలతో కలిసి...

ఏపీలో పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

ఏపీలో పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ
X

ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో కొడుకు, కూతురుతో కలిసి ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు జీవనాధారంగా ఉన్న హోటల్‌ని వైసీపీ కార్యకర్త కృష్ణారెడ్డి ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని ఆమె ఆరోపించారు. పదేపదే వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది. తన భర్త చనిపోయాడని.. బంధువులు కూడా ఎవరూ లేరని తెలిపింది. తనను, తన బిడ్డల్ని కాపాడాలంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తన కుటుంబం చావుకు కృష్ణారెడ్డి కారణమంటూ పురుగుల మందు తాగబోయింది. అయితే.. హోటల్‌ స్థలంలో తనకూ భాగం ఉందని కృష్ణారెడ్డి నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.


Next Story