Srikakulam: అబ్బాయి మెడలో అమ్మాయి తాళి.. ఆ ఊళ్లో అదే ఆచారం.. దాంతో పాటు..

Srikakulam: అబ్బాయి మెడలో అమ్మాయి తాళి.. ఆ ఊళ్లో అదే ఆచారం.. దాంతో పాటు..
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో పెళ్లిళ్లు కొంచెం డిఫరెంట్‌. అక్కడ అమ్మాయే అబ్బాయి మెడలో తాళి కడుతుంది.

Srikakulam: పెళ్లంటే లక్షల్లో ఖర్చు. కొందరు ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పులపాలై అష్టకష్టాలు పడిన ఘటనలు కోకొల్లలు. కానీ.. శ్రీకాకుళం జిల్లాలో పెళ్లిళ్లు కొంచెం డిఫరెంట్‌. అక్కడ అమ్మాయే అబ్బాయి మెడలో తాళి కడుతుంది. గ్రామంలో పెళ్లీడుకు వచ్చిన అబ్బాయిల్ని గుర్తించి వారికి సామూహికంగా వివాహాలు జరిపిస్తారు. ఇక్కడ ఇంకో కండిషన్‌ కూడా ఉంది. అబ్బాయిలంతా కచ్చితంగా అదే ఊరు అమ్మాయిలను పెళ్లాడాలి. వేరే ఆప్షన్ ఏమీ ఉండదు.

ఈ ఆచారాన్ని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామ పెద్దలు తరతరాలుగా కొనసాగిస్తున్నారు. వరకట్నాల్లాంటివేమీ లేకుండా పెళ్లిళ్లు జరగడం నువ్వలరేవు ప్రత్యేకత. గ్రామంలో రెండేళ్లకు ఓసారి పెళ్లీడుకు వచ్చిన యువతీ యువకుల్ని గుర్తించి వారికి పెళ్లి సంబంధాలు కుదుర్చుతారు. తర్వాత సామూహికంగా ఒకే మూహూర్తంలో అందరి పెళ్లిళ్లు జరిపిస్తారు. ఈ సందర్భంగా ఊరు ఊరంతా సన్నాయి మేళాలతో సందడి నెలకొంటుంది.

ఏది ఏమైనా ఊళ్లో వాళ్లనే పెళ్లి చేసుకోవడం, వరకట్న బాధలు లేకపోవడం, పైగా వరుడి మెడలో వధువు తాళి కట్టడం ఇలా ఎన్నో ప్రత్యేకలు ఈ నువ్వలరేవు గ్రామానికి ఉన్నాయని గొప్పగా చెప్తారు స్థానికులు. విశాలమైన ఉప్పుటేరు సమీపంలో బతుకునావ లాగిస్తున్న ఈ ఊరి గ్రామస్థులు.. సంప్రదాయల్ని పాటించే విషయంలో కచ్చితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంగ్లేయుల కాలంనాటి దీపస్తంభం లాంటి ప్రత్యేకతలే కాదు.. సామూహిక వివాహాలతోనూ తమకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్తారు.

Tags

Read MoreRead Less
Next Story