YSR Kadapa District : మంచి నీళ్ల కోసం వైఎస్ఆర్ కడప జిల్లాలో మహిళల ఆందోళన

YSR Kadapa District : మంచి నీళ్ల కోసం వైఎస్ఆర్ కడప జిల్లాలో మహిళల ఆందోళన
X

వైయస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలో ఖాళీ బిందెలతో మహిళలు రొడ్డెక్కారు. వివేకానంద రెడ్డి నగర్‌లో ఉగాది పండుగ నుంచి నీళ్ళు రావడం లేదని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని చుట్టుముట్టి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండు మూడు రోజుల్లో శాశ్వతంగా నీటిని అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. జగన్ సొంత ఇలాకాలో నీళ్లకోసం మహిళల ఆందోళన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story