ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh : నందిగామలో పేకాట రాయుళ్ల హల్ చల్.. !

Andhra Pradesh : ఏపీలో సంక్రాంతి సంప్రదాయం ముసుగులో విషపు సంస్కృతిని తీసుకొస్తాన్నారు కొందరు అక్రమార్కులు.

Andhra Pradesh : నందిగామలో పేకాట రాయుళ్ల హల్ చల్.. !
X

Andhra Pradesh : ఏపీలో సంక్రాంతి సంప్రదాయం ముసుగులో విషపు సంస్కృతిని తీసుకొస్తాన్నారు కొందరు అక్రమార్కులు. కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో పేకాట రాయుళ్లు హల్ చల్ చేస్తున్నారు. కంచికచర్ల మండలం పెండ్యాలలో నూతన హంగులతో పేకాట శిబిరాలు వెలిశాయి. ఆడ,మగ తేడా లేకుండా పేకాట ఆడుతున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పేకాట శిబిరాల్లో మద్యం ఏరులై పారుతోంది. పేకాట శిబిరాల వెనుక అధికారపార్టీ నాయకుల అన్నదమ్ములు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల తీరును నియోజకవర్గ ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Next Story

RELATED STORIES