Srisailam Dam : శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు

Srisailam Dam : శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు
X

శ్రీశైలం జలాశయం మరమ్మతులకు రుణం మంజూరు చేసేందుకు ప్రపంచ బ్యాంకు బృందం ప్రాజెక్టు అధికారులతో భేటీ అయింది. డ్యామ్ సేఫ్టీ, సీడబ్ల్యూసీ అధికారులతో కలిసి ఆ బృందం ప్రాజెక్టును పరిశీలించింది. యాంటి జెలాన్స్కీ ఆధ్వర్యంలోని ప్రపంచ బ్యాంక్ టెక్నికల్ ఎక్స్పర్ట్ బృందం, డ్యామ్ సేఫ్టీ అధికారులు ముక్కల రమేష్, రాజగోపాల్, సీడబ్ల్యూసి అధికారి సేలం రెండు రోజుల పాటు ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పరిశీలించారు.

జలాశయానికి సంబంధించిన ప్లాంజ్ ఫుల్, అప్రోచ్ రోడ్డు డ్యామ్ గేట్లు, కొండ చరియలకు కేటాయించిన నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జలాశయం వ్యూ పాయింట్ వద్ద డ్యామ్ సేఫ్టీ, సిడబ్ల్యూసీ అధికారు లతో ముఖాముఖిగా చర్చించారు.

Tags

Next Story