జగన్ సర్కార్‌పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఫైర్

జగన్ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. జగన్.. పేదల రక్తాన్ని జలగ పీల్చినట్లు పీల్చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన రాబడి మొత్తం.. జె.గ్యాంగ్ జేబుల్లోకి పోతుందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే పన్నులు, ఛార్జీలు పెంపు ద్వారా 70 వేల కోట్లు భారం మోపారని ఆరోపించారు. పట్టణ భూముల విలువ పెంపుతో ప్రజలపై 800 కోట్ల భారం పడిందన్నారు. ఆస్తి పన్ను, 15 శాతం పెంపుతో 8 వేల కోట్లు భారాన్ని ప్రజలపై వేశారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక దొడ్డిదారిన విద్యుత్ బిల్లులు పెంచి 3 వేల కోట్లు భారాన్ని పేదలపై వేశారన్నారు. యూజర్ చార్జీల పెంపుతో 2 వేల 400 కోట్లు కొల్లగొట్టారన్నారు. అలాగే మద్యం మాఫియాతో 25 వేల కోట్లు దోపిడి జరిగిందన్నారు. ఇసుక దోపిడిలో కూడా జె.గ్యాంగ్ 18 వేల కోట్లు దోచేశారన్నారు. ఇళ్లస్థలాలకు భూసేకరణలో 4 వేల కోట్ల దోపిడి జరిగిందననారు యనమల రామకృష్ణుడు.