గుంటూరు జిల్లాలో కరోనా నిబంధనలను గాలికొదిలేసిన వైసీపీ కార్యకర్తలు ..!

గుంటూరు జిల్లాలో కరోనా నిబంధనలను గాలికొదిలేసిన వైసీపీ కార్యకర్తలు ..!
గుంటూరు జిల్లా గురజాలలో వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి.. పుట్టిన రోజు వేడుకల్లో కరోనా నిబంధనలను కార్యకర్తలు గాలికొదిలేశారు.

గుంటూరు జిల్లా గురజాలలో వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి.. పుట్టిన రోజు వేడుకల్లో కరోనా నిబంధనలను కార్యకర్తలు గాలికొదిలేశారు. కర్ఫ్యూ సమయంలో ఓ సినిమా హాల్లో కార్యకర్తల కోసం ప్రత్యేకంగా షో వేసి.. వేడుకలు నిర్వహించారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా.. పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వినాయక చవితి వేడుకులకు అడ్డొచ్చిన కరోనా.. వైసీపీ నేతల పుట్టిన రోజు పార్టీలకు అడ్డురాదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. రాత్రి 12 గంటలకు బైక్‌ ర్యాలీలు చేస్తున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story