మంత్రి బొత్సకు వైసీపీ కార్యకర్తల నుంచి నిరసన సెగ

X
అనంతపురం జిల్లా కల్యణదుర్గం సమీపంలో మంత్రి బొత్స సత్యనారాయణకు వైసీపీ నేతలు, కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. బెంగళూరు నుంచి కల్యాణదుర్గం వస్తుండగా మార్గమధ్యలో వైసీపీ ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు, కార్యకర్తలు బొత్స వాహనాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఉషా చరణ్‌శ్రీ తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఉషా చరణ్‌శ్రీ కూడా బొత్స వాహనంలోనే కూర్చుని ఉన్నారు. ఏమ్మెల్యే ఉషా చరణ్‌శ్రీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. కార్యకర్తల నుంచి విజ్ఞాపనలు తీసుకున్న మంత్రి బొత్స... అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
