YCP: వేళ్లన్నీ సజ్జల వైపే

YCP: వేళ్లన్నీ సజ్జల వైపే
పార్టీ నుంచి ఒక్కొక్కరు పోతున్న నిశ్శబ్దంగా జగన్‌... సజ్జల వల్లే పార్టీ వీడుతున్నామంటూ పలువురి వ్యాఖ్యలు

వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు వెళ్లిపోతున్నారు. రాజ్యసభ ఎంపీల్లో ఒకరిద్దరే మిగిలేలా ఉన్నారు. ఇక ఎమ్మెల్సీల సంగతి చెప్పాల్సిన పనిలేదు. పార్టీలో ఇంత జరుగుతుంటే.. వైసీపీ అధినేత జగన్ చాలా కామ్‌గా ఉన్నారు. ఎవరి దారి వారు చూసుకుంటున్న కిమ్మనడం లేదు. ఇదిలా ఉంటే చాలా మంది పార్టీ అభిమానులు పోయే వాళ్లను ఎలాగూ ఆపలేరు కాబట్టి.. వాళ్లతో పాటు సజ్జల కూడా తన దారి తాను చూసుకుంటే సంతోషించే వారమని నేరుగా చెబుతున్నారు. ఆయనపై ఎందుకింత అసంతృప్తి.. ఆక్రోశమన్న కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

అప్పుడే తీవ్ర అసంతృప్తి..

పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డిపై అసంతృప్తి తీవ్రంగా ఉండేది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు సీఎం జగన్ కలవాలంటే కూడా సజ్జల రెకమెండేషన్, ఆయన అనుమతి కావాల్సి వచ్చేది. దీంతో పార్టీ నాయకుల్లో తీవ్రమైన నిరాశ నెలకొంది. తప్పుడు పనులన్నింటికీ ఆయనే సలహాదారుడని ఎక్కువ మంది నాయకులు ఆరోపణలు చేసేవారు. మంత్రి వర్గాన్ని మార్చినప్పటి నుంచి పెరిగిన అసంతృప్తి.. అభ్యర్థుల ఎంపిక కసరత్తుకు వచ్చే సరికి పీకల వరకు చేరిపోయింది. కానీ జగన్ వద్ద ఆయనకు ఉన్న పలుకుబడి చూసి ఆగిపోయారు. పార్టీ ఓడిపోయిన తర్వాత అత్యధిక మంది సజ్జల రామకృష్ణారెడ్డినే నిందించారు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీ సమావేశాల్లో జగన్ పక్కనే కనపడుతూండటంతో క్యాడర్ లో అసహనం పెరుగుతోంది.

లైంగిక ఆరోపణల్లో..

ప్రస్తుతం ముంబైనటి వ్యవహరం తెరమీదకు వచ్చింది. ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా వైసీపీలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆమె జరిగిన మానసిక అత్యాచారానికి పూర్తి బాధ్యుడిగా సజ్జలే ఉన్నారని తెలుస్తోంది. అయితే సరైన ఆధారాలు దొరికితే ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది. ఇప్పటికే గొరంట్ల మాధవ్, అనంత్బాబు, దువ్వాడ శ్రీనివాస్, కుక్కల విద్యాసాగర్ లాంటి నాయకుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. దీని వల్ల మరింత అప్రతిష్ట రానుంది. ఈ విషయాలన్ని తెలిసినా అప్పటి ప్రభుత్వ సలహదారుగా ఉన్న సజ్జల జగన్ను తప్పుదారి పట్టించారు. ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీని వీడిపోతున్నారని.. అయితే ఎంత మంది పోయినా.. వారితో పాటు సజ్జల కూడా పోవాలన్నది ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. కానీ సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రం గెంటేసినా పోయేది లేదని ఖరఖండిగా తేల్చి చెప్పారు. జగన్, పార్టీ రహస్యాలు అన్నీ తనకు తెలుసన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సజ్జలపై పీకల్లోతూ కొపంలో ఉన్న వైసీపీ క్యాడర్ ఆయన కనిపిస్తేనే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తోంది.

Tags

Next Story