YCP MLA: జగన్‌ వినకపోవడం వల్లే ఓడిపోయాం

YCP MLA: జగన్‌ వినకపోవడం వల్లే ఓడిపోయాం
X
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆవేదన... జగన్‌ ఎంత చెప్పినా వినలేదన్న ధర్మశ్రీ

వైసీపీ అధినేత జగన్‌ తమ మాట వినకపోవడం వల్లే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో చాలా తప్పులు జరిగాయని... కానీ వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ప్రజలు తమను తిరస్కరించారని అన్నారు. చోడవరంలో తన ఓటమికి బీఎన్‌ రహదారి గోతులే ప్రధాన కారణమన్నారు. ఎన్నికలకు ముందు జగన్‌కు ఎన్నిసార్లు చెప్పినా తమ మాట వినిపించుకోలేదని... ఫలితంగానే భారీ ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలిసో, తెలియకో చేసిన తప్పుల వల్ల ప్రజలు తమను అధికారానికి దూరం చేశారని ధర్మశ్రీ వాపోయారు. వైసీపీకి చెందిన చెందిన సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ఒకటే చెబుతున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే స్వాగతం పలికి వారితో కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆహ్వానం లేకపోతే వెళ్లడం, వెళ్లకపోవడం మీ ఇష్టమని ధర్మశ్రీ సూచించారు.

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ...

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ సుహృద్భావ వాతవరణంలో జరిగింది. భేటీ సందర్భంగా చంద్రబాబునాయుడు-రేవంత్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తమ మంత్రులు, అధికారులను పరిచయం చేయగా.. చంద్రబాబునాయుడు ఏపీ మంత్రులు, అధికారులను పరిచయం చేశారు. అనంతరం రెండు గంటలపాటు సమావేశం సామరస్యంగా జరిగింది. అనుకున్న సమయం కంటే ముందే రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌కు చేరుకున్నారు. రేవంత్‌ వచ్చిన తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చారు. ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు చేరుకున్నారు. ఆయనకు రేవంత్‌రెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. భట్టి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ కూడా చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు అందించారు. సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన సమావేశంలో తొలుత చంద్రబాబును శాలువాతో సత్కరించిన రేవంత్‌.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు రచించిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించారు. చంద్రబాబు సైతం రేవంత్, భట్టి విక్రమార్కలను శాలువాలతో సత్కరించి, వేంకటేశ్వరస్వామి ప్రతిమలను అందజేశారు.

గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు చాలా సున్నితమైనవని. .వారి సెంటిమెంట్‌ను గౌరవించేలా నడుచుకుందామన్నారు.

Tags

Next Story