JANASENA: జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే దొరబాబు

JANASENA: జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే దొరబాబు
X

పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పెండెం దొరబాబుకు పవన్ కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరినట్లు ప్రకటించారు.


తనతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్, పిఠాపురం జడ్పీటీసీ సభ్యుడు బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, పిఠాపురం పురపాలక సంఘం వైస్‌ ఛైర్‌పర్సన్‌ కొత్తపల్లి పద్మ బుజ్జి, మరికొందరు నేతలు, తన అనుచరులు కూడా జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలిలో జనసేన విప్ హరిప్రసాద్, జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Tags

Next Story