వైసీపీ సర్కారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించింది : చంద్రబాబు

X
పూలె, గాంధీ, అంబేద్కర్ ఆశయాల సాధన కోసమే.... ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని నెలకొల్పారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాముల్ని చేసేందుకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలె 130వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నివాళులర్పించారు. బీసీలు టీడీపీకి వెన్నెముకగా ఉంటారనే అక్కసుతోనే.... వైసీపీ సర్కారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించిందని చంద్రబాబు మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
