YSRCP : విజయమ్మ లేఖపై వైసీపీ సీరియస్

YSRCP : విజయమ్మ లేఖపై వైసీపీ సీరియస్
X

వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ రాసిన బహిరంగ లేఖపై YSRCP ఘాటుగా స్పందించింది. ఆ లేఖపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది జగన్‌ బెయిల్‌ క్యాన్సిల్ చేసేందుకు జరుగుతున్న కుట్ర అని ఆరోపించింది. షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్లకు లొంగి సరస్వతి కంపెనీ షేర్ల సర్టిఫికెట్లు పోయాయంటూ.. జగన్‌ సంతకాలు లేకుండానే షేర్లు బదిలీ చేయడం మోసపూరితం కాదా? అని నిలదీసింది. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడమే కాకుండా ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ను అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలంటూ విజయమ్మ అడగడమేమిటని ప్రశ్నించింది వైసీపీ.

Tags

Next Story