NTR District : వైసీపీ నేత వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

NTR District : వైసీపీ నేత వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
X

వైసీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆ పార్టీ నేతల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో చోటు చేసుకుంది. కీసరకు చెందిన రాంబాబుకు అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత రమేష్‌ భూమి కొనిస్తానని డబ్బులు తీసుకున్నాడు. భూమి కొనివ్వకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల పెట్రోల్‌ పోసి తగులబెట్టేందుకు యత్నించడంతో బాధితుడు కంచికచర్ల పోలీసులను ఆశ్రయించాడు. తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా రమేష్‌ వేధింపులు ఎక్కువవడంతో రాంబాబు బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తన్నారు. ఈ క్రమంలో రాంబాబు తన గోడును సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి నారా లోకేశ్‌కు తెలిపాడు. దీనిపై మంత్రి ఏ విధంగా స్పందిస్తాడనేది చూడాలి.

Tags

Next Story