రోడ్డుకు అడ్డంగా గోడనిర్మించిన వైసీపీ నేత

రాష్ట్రంలో వైసీపీ నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమగోదావరిజిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో ఓ వైసీపీ నేత రహదారికి అడ్డంగా గోడ నిర్మించి తన అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. గ్రామానికిచెందిన వైసీపీ నాయకుడు మాజీ ఐఎఫ్ ఎస్ అధికారి పీతల ప్రసాద్ బాబు.. చిట్యాల గ్రామంలో దళితులవద్ద ప్రభుత్వ పట్టా భూమిని కొనుగోలుచేసి.. పెద్దభవంతిని నిర్మించాడు. ఆ భవనానికి ఎదురుగా ఉన్న స్థలాన్ని ఆక్రమించుకొని మధ్యనుంచి వెళుతున్న రోడ్డును కబ్జాచేసి గోడ నిర్మించాడు. అదేమని ప్రశ్నించిన సరేలి శివ, అతని తల్లిపై దాడికి పాల్పడ్డాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో... అక్రమ నిర్మాణాన్ని పోలీసులు ఆగస్టు 25న కూల్చివేశారు. అయితే గత నెలరోజులుగా నిమ్మనకుండిపోయిన ప్రసాద్ బాబు మరోసారి రహదారికి అడ్డంగా గోడ నిర్మించాడు. తాము నడవడానికి వీళ్లేకుండా గోడ నిర్మించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయంచేయాలని వేడుకొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com