POSANI: పోసాని రాజకీయ సన్యాసం

POSANI: పోసాని రాజకీయ సన్యాసం
X
రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటన... ఇక రాజకీయాలపై మాట్లాడబోనని వెల్లడి..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం సంభవించింది. వైసీపీ నేత, సినీ రచయిత పోసాని కృష్ణమురళి రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెబుతున్నట్లుగా ప్రకటించారు. ఏపీ మాజీ ఫిల్మ్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక నుంచి పాలిటిక్స్ జోలికి వెళ్లబోననని ఆయన వెల్లడించారు. అదేవిధంగా రాజకీయాలపై కూడా ఎన్నడూ మాట్లాడబోనని స్టేట్‌మెంట్ ఇచ్చారు. వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ తనకు సభ్యత్వం లేదని తెలిపారు. ఏ పార్టీని అయినా తాను సామన్య ఓటరులాగే ప్రశ్నించానని.. మంచి చేస్తే వాళ్లకి సపోర్ట్‌ చేశానని అన్నారు. తన చివరి శ్వాస వరకు కుంటుంబం కోసమే బతుకుతానని పోసాని కృష్ణమురళి ప్రకటించారు. , వైసీపీ మద్దుతుదారుడైన పోసాని కృష్ణమురళిపై ఇటీవలే ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ అధికారులు ఆయపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ నెలలో ఓ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోసాని కృష్ణమురళి మీడియాలో మాట్లాడారని వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోసానిపై 111, 196, 353, 299, 336 (3) (4), 341, 61(2) బీఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.

ఇక నో రాజకీయాలు

ఇక నుంచి తాను రాజకీయాలు మాట్లాడనని పోసాని కృష్ణమురళి అన్నారు. అలాగే ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని పోసాని ప్రకటించారు. వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలో తనకు సభ్యత్వం లేదని కూడా ఆయన చెప్పేశారు. ఇక ఏ పార్టీని పొగడను, మాట్లాడను, విమర్శించనని తేల్చిచెప్పేశారు. ఇక రాజకీయ గురించి మాట్లాడబోనని కూడా తేల్చేశారు. అయితే పోసాని ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనక జనసేన శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది. పోసాని నోటి దురుసుపై జనసేన నేతలు వరుసుగా కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నమోదుతో ఉక్కిరిబిక్కిరి అయిన పోసాని రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

బిగుస్తున్న ఉచ్చు..

ఆంధ్రప్రదేశ్ లో కొలువైన కూటమి ప్రభుత్వం గతంలో తమ నేతలను అనరాని పచ్చి మాటలతో దాడి చేసిన నేతలపై ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాజకీయంగా విమర్శలు కాకుండా.. కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడిన వారినీ .. పోస్టులు చేసిన వారిని టార్గెట్ చేస్తోంది. వైసీపీ వాళ్లు మాత్రం ఇది కక్ష్య సాధింపు చర్య అన్నా.. కూటమి ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాటిని భవిష్యత్తులో కట్టడి చేయాలంటే కాస్తంత కటువు ప్రవర్తించాల్సిందే అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ లను అనరాని మాటలన్న పోసాని కృష్ణ మురళిపై ఇప్పటికే టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లలో కంప్లైంట్ చేశారు. అంతేకాదు ఆయనపై పలు చోట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు అతి తొందరలోనే పోలీసులు పోసానిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలిటిక్స్ కు దూరంగా ఉంటానంటూ పోసాని సంచలన ప్రకటన చేశారు. తన కుటుంబ సభ్యుల క్షేమం కోసమే రాజకీయాలను ఒదిలేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు.

Tags

Next Story