YCP : శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లలో వైసీపీ నేతల అత్యుత్సాహం

YCP : శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లలో వైసీపీ నేతల అత్యుత్సాహం
YCP : శ్రీరామనవమి వేడుకల్లో ప్రాధాన్యం దక్కలేదని వైసీపీ నేతలు ఏకంగా రామాలయాలకే తాళాలు వేస్తున్నారు.

YCP : శ్రీరామనవమి వేడుకల్లో ప్రాధాన్యం దక్కలేదని వైసీపీ నేతలు ఏకంగా రామాలయాలకే తాళాలు వేస్తున్నారు. నిన్న విజయనగరం, ఇవాళ గుంటూరులో ఇలాంటివి రెండు సంఘటనలు జరిగాయి. తమకు దక్కనిది వేరెవరికీ దక్కకూడదన్న తరహాలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పూజాదికాలు చేయనీయకుండా రామాలయాలకు తాళాలు వేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలో సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఇలాకాలో వైసీపీ నేతల దాష్టీకం ఎలా ఉందో చూడండంటున్నారు స్థానికులు. వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో 50 ఏళ్లుగా సీతారామస్వామి గుడిలో కల్యాణోత్సవాలు జరుగుతున్నాయి. అలాంటి గుడికి వైసీపీ నేతలు తాళం వేయించారని చెబుతున్నారు గ్రామస్తులు. రాముని కల్యాణం తామే చేయాలంటూ కొంతమంది అధికార పార్టీ నేతలు పోలీసుల ద్వారా చెప్పించారంటూ స్థానికులు చెబుతున్నారు.

ప్రతి ఏటా లాగే పందిరి కోసమని గుంజలు పాతగా.. పోలీసులు వచ్చి పందిరి కోసం పాతిన కర్రలను పీకేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుడికి తాళాలు వేసి స్టేషన్‌లో అప్పజెప్పాలని అర్చకుడికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారంటున్నారు. స్వామివారికి నిత్య నైవేద్యం సమర్పించాలని అర్చకులు చెప్పినా సరే.. అలాంటివేమీ లేవు, ముందు గుడికి తాళం వేసి ఇవ్వాలంటూ పోలీసులు చెప్పారంటున్నారు. వైసీపీ నేతల అహంకార ధోరణి కారణంగానే ఇలా జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

విజయనగరం జిల్లాలోనూ రాములవారి గుడికి తాళం వేశారు. జామి మండలం అలమండలో నవమి వేడుకలు ఘనంగా చేయాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. కల్యాణ క్రతువులో పాల్గొనే దంపతుల పేర్లు కూడా ఖరారు చేశారు. అయితే, తన కుటుంబ సభ్యులు కూడా కల్యాణంలో కూర్చుంటారని స్థానిక వైసీపీ నేత, ఉప సర్పంచ్‌ వాదనకు దిగాడు. అప్పటికే పేర్లు ఖరారయ్యాయని గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు చెప్పినప్పటికీ ఆ వైసీపీ నేత వినిపించుకోలేదు. చివరికి రామాలయానికి తాళం వేశాడు. అక్కడున్న ఆడవాళ్లు నిరసన తెలపడంతో తాళం తిరిగిచ్చాడు.

Tags

Read MoreRead Less
Next Story