Andhra Pradesh : గడప గడపకు ప్రభుత్వంలో వైసీపీ నేతలకు నిరసన సెగలు

Andhra Pradesh : జగన్ సర్కార్ చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు నిరసన సెగ తగులుతోంది. ఇన్నేళ్ల తరువాత గుమ్మం తొక్కుతున్న నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు ప్రజలు. ఓవైపు నిలదీస్తున్నా సరే.. సమస్యలు వినకుండా వెళ్లిపోతున్న ప్రజాప్రతినిధులపై తిట్ల దండకం అందుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీ నేతలకు ఒకేరకమైన చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని కోట్నూరులో ప్రజాసమస్యలు పట్టించుకోకుండా వెళ్లిపోయిన ఎంపీ, ఎమ్మెల్సీపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారం కానప్పుడు.. గడప గడపకు వచ్చి ఏం లాభం అంటూ నిలదీశారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్‌ను స్థానికులు నిలబెట్టేశారు. డ్రైనేజీలు, రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నమని ఏకరవు పెట్టారు. ఓవైపు మహిళలు సమస్యలపై ప్రశ్నిస్తుంటే.. ఎంపీ, ఎమ్మెల్సీ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లారు.
హిందూపురంలో వర్గపోరు కారణంగా గడప గడప కార్యక్రమంలో ఇతర నాయకులు ఎవరూ కూడా కనపడలేదు. దీంతో చేసేది లేక ప్రజలు సమస్యలు సైతం వినకుండా రెండు మూడు వీధులు తిరిగి ఎంపీ, ఎమ్మెల్సీ వెనుదిరిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com