MLA Daggupati : చంద్రబాబు సాఫ్ట్ కార్నర్ తో ఉండటం వల్ల వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు

సీఎం చంద్రబాబు సాఫ్ట్ కార్నర్ తో ఉండటం వల్ల వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నియోజకవర్గంలోని నారాయణపురం పంచాయతీలో ఆయన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మహిళా ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యల మీద ఆయన తీవ్రంగా స్పందించారు. వైసిపి నాయకులు గతంలో ఎలా మాట్లాడారో. ఇప్పుడు అలానే మాట్లాడుతున్నారన్నారు. కేవలం మా నాయకుడి సాఫ్ట్ కార్నర్ వల్లనే రెచ్చిపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు కక్షలు కార్పన్యాలకు వెళ్ళవద్దని మమ్మల్ని ఆపుతున్నారన్నారు. మాకు చీము, నెత్తురు ఉందని మాకు ఒకసారి పర్మిషన్ ఇస్తే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు. వారి నాయకుడు ఎలా ప్రవర్తిస్తారో.. ఆ పార్టీ నాయకులు కూడా అలాగే ఉంటున్నారని.. వారి తీరు మారకపోతే కచ్చితంగా ప్రజలతో పాటు తాము కూడా బుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com