ఆంధ్రప్రదేశ్

Visakhapatnam: విశాఖ వైసీపీలో వర్గపోరు.. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ..

Visakhapatnam: విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ సొంత పార్టీలోని పెద్దలపై అసంతృప్తి వ్యక్తం చేశారు

Visakhapatnam: విశాఖ వైసీపీలో వర్గపోరు.. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ..
X

Visakhapatnam: విశాఖ వైసీపీలో వర్గపోరు రచ్చకెక్కుతోంది.. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ మరోసారి సొంత పార్టీలోని పెద్దలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యేలు గెలిస్తేనే జగన్‌ మరోసారి సీఎం అవుతారని.. ఎంపీలు గెలిస్తే కాదంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ హాట్‌ కామెంట్స్‌ చేశారు.. దక్షిణంలో తనను కాదని సీతంరాజు సుధాకర్‌కు పార్టీలో పెద్దపీట వేస్తున్నారని.. ఇది నష్టాన్నే చేకూరుస్తుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు..

తనకు విజయసాయిరెడ్డి అండదండలు ఉన్నాయని ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో సీతంరాజు సుధాకర్‌ వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు వాసుపల్లి గణేష్‌. ఇప్పుడే కాదు. వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ గతంలోనూ పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు..

ఇప్పుడు బహిరంగంగా విజయసాయి రెడ్డి పేరు ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాంతీయ కోఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులు కావడం, ఇవాళ ఆయన ప్రత్యేకంగా పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Next Story

RELATED STORIES