వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి..!

వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి..!
కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇటీవల హైదరాబాద్ లో చికిత్స పొంది వచ్చిన ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. అయితే మళ్లీ అనారోగ్యానికి గురవ్వడంతో కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఇవాళ కన్నుమూశారు. సుబ్బయ్య మృతి పట్ల పలువురు వైసీపీ నేతలు సంతాపం తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story