భీమవరం వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

భీమవరం వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
X
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. జిల్లాలో రోడ్ల దుస్థితిని బయటపెట్టారు.

ఏపీలో అధ్వాన్న రోడ్లపై స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఆవేదనను వెళ్లగక్కారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. జిల్లాలో రోడ్ల దుస్థితిని బయటపెట్టారు. డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మంత్రులు, ఎంపీ ఎదుటే రహదారులు గుంతలమయంగా ఉన్నాయని చెప్పారు. నరకప్రాయంగా మారిన రోడ్లపై తానైతే తిరగలేనని తెలిపారు. తాను ఏలూరు వెళ్లి రావడానికి భయపడుతుంటానని.. కానీ, ఎమ్మెల్సీ మోషెన్రాజు అధ్వాన్నమైన రోడ్లపై తిరుగుతుండటం అభినందనీయమన్నారు. రహదారుల దుస్థితిపై ఇప్పటికే జనసేన, టీడీపీ ఆందోళనలు చేపడుతున్నాయి. ఇపుడు ఏకంగా భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Tags

Next Story