నేను చెప్పిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించకపోతే నీళ్లు ఆపేస్తాం.. కరెంట్ కట్ చేస్తాం : కన్నబాబు

నేను చెప్పిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించకపోతే నీళ్లు ఆపేస్తాం.. కరెంట్ కట్ చేస్తాం : కన్నబాబు
X
మరో వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన వారినే సర్పంచ్‌గా గెలిపించాలని, లేదంటే పనుల కోసం ఊరు ఊరంతా తన వెంట తిరగాలని డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చారు.

మరో వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన వారినే సర్పంచ్‌గా గెలిపించాలని, లేదంటే పనుల కోసం ఊరు ఊరంతా తన వెంట తిరగాలని డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చారు యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు. యలమంచిలి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి తర్వాత అంతా తానేనని సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. ఇళ్ల పట్టాలిచ్చాము.అయితే ఇళ్లు కట్టుకోవాలన్నా, రోడ్లు రావాలన్నా, డ్రైనేజీ కట్టాలన్నా.. నేనే చూడాలి. నేను చెప్పిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించకపోతే నీళ్లు ఆపేస్తాము, కరెంట్ కట్ చేస్తాము.. అందులో ఎలాంటి మొహమాటం లేదంటూ తెగేసి చెప్పారు కన్నబాబు.

Tags

Next Story