AP: ఏపీలో రచ్చగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారం
ఆంధ్రప్రదేశ్‌లై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రచ్చగా మారింది. దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వల మాధురికి ఎఫైర్ ఉందంటూ శ్రీనివాస్ భార్య వాణి సంచలన ఆరోపణలు చేశారు. దీనికి దివ్వల మాధురి కౌంటర్ ఇచ్చారు. తనను అనవసరంగా బయటకు లాగొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.. శ్రీనివాస్ భార్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. క్యారెక్టర్ లేని మహిళగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దువ్వాడ వ్యవహారం వారి కుటుంబానికి సంబంధించినదని... వారితోనే తేల్చుకోవాలని సూచించారు. కానీ, తనను మధ్యలోకి లాగొద్దని మాధురి అన్నారు.. దువ్వాడ వాణి తన భర్తను వద్దనుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన మాధురి.. అసెంబ్లీ టిక్కెట్ తనకే ఇవ్వాలని వైఎస్ జగన్‌ను కలిశారని చెప్పుకొచ్చారు..తాను దువ్వాడ శ్రీనివాస్‌కు ఎందుకు దగ్గరయ్యాననే విషయాన్ని కూడా దివ్వల మాధురి బయటపెట్టారు .
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ దశలో దువ్వాడ శ్రీనివాస్ తనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన ఓ ఫ్రెండ్, ఫీలాసపర్ ఇంకా అన్నీ అని చెప్పుకొచ్చారు. ఆయన చాలా నిజాయతీ పరుడని మాధురి ప్రశంసించారు.. మరోవైపు.. తాను దువ్వాడను ట్రాప్ చేయడానికి ఆయన వద్ద ఆస్తులేమీ లేవన్నారు. అతని ఆస్తులన్నీ కుటుంబానికి రాసిచ్చారని.. అలాంటప్పుడు ఇంకా నేను ఏం ఆశించి ట్రాప్ చేస్తామని దివ్వల మాధురి ప్రశ్నించారు . మరోవైపు.. సార్వత్రిక ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ప్రచారం కోసం తానే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టానని తెలిపారు. ఆ విషయం పార్టీ క్యాడర్ మొత్తానికి తెలుసన్నారు.
ఈ సమయంలో ప్రతీ ఇంటికి వెళ్తూ.. శ్రీనివాస్-మాధురికి ఎఫైర్ ఉందంటూ.. వాణి చెప్పడం ఎంతవరకు సమంజసం అని మాధురి నిలదీశారు.. ఇక, మీకు ఓట్ బ్యాంక్ ఉంది పార్టిలోకి రావాలని వారే ఆహ్వానించారు. మా ఫ్యామిలి పెద్ద కుటుంబమని... రాజకీయాలకు తాను చాలా దూరమని మాధురి తెలిపారు. జగనన్న అంటే తనకు చాలా ఇంట్రెస్ట్ అని తెలిపారు . దీంతో తనను బతిమాలి పార్టీలో జాయిన్ చేశారని మాధురి వెల్లడించారు.. అయితే, భార్య భర్తల మధ్య గొడవ ఉండకూడదని తాను దూరంగా ఉన్నానని తెలిపారు. తను, తన ఫ్యామిలీని వీధిలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎవరితో అయినా కలిసి ఉండే హక్కు తనకు ఉందన్న మాధురి.. తమది మాత్రం ఇల్లీగల్ ఎఫైర్ కాదని స్పష్టం చేశారు. దువ్వాడ వాణి కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆమె తన భర్తతో కూర్చుని పరిష్కరించుకోవాలని సూచించిన ఆమె.. మధ్యలో తనపై ఆరోపణలు చేయకూడదని వార్నింగ్ ఇచ్చారు.. తనపై లేనిపోని ఆరోపణలు చేశారు కాబట్టే.. నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com