AP: రోజుకో మలుపు తిరుగుతున్న దువ్వాడ వ్యవహారం
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీనివాస్ వ్యవహారంపై కొన్ని రోజులుగా ఆయన భార్య వాణి తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆదివారం టెక్కలి వైసీపీ నేత, దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి కారు ప్రమాదంలో గాయపడ్డారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ సమీపంలో ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల సాయంతో ఆమెను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆమె జూమ్ కాల్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
నాకు బతకాలని లేదన్న మాధురి
అయితే పలాస ఆసుపత్రిలో దివ్వెల మాధురి వైద్యానికి నిరాకరించారు. తన మీద ఆరోపణలు చేస్తే తీసుకోగలను, కానీ తన పిల్లలపై ఆరోపణలు చేస్తే తట్టుకోలేనని తెలిపారు. తనకు ఏ ట్రీట్ మెంట్ అక్కర్లేదు, తనకు బతకాలని లేదన్నారు. తాను చనిపోవాలనుకున్నా.. దువ్వాడ వాణి చేస్తున్న వేధింపులతోనే చనిపోవాలనుకుంటున్నని చెప్పారు. తనను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని వాణి ఆరోపిస్తుంది. ఈ ప్రమాదంలో తను చనిపోతే దువ్వాడ వాని పైనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెబుతోంది. హైవేపై సూసైడ్ చేసుకునేందుకే పలాస బయలుదేరాను అంటూ దివ్వల మాధురి తెలిపింది.
ఇంతకీ ఏమైందంటే...
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వ్యవహారంలో మాధురి పేరు ఇటీవల చర్చనీయాంశమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తన భర్త మాధురితోనే ఉంటూ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన భార్య, టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధురి మీడియాతో మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా తనపై ట్రోల్ చేస్తున్న వార్తలకు తీవ్ర మనస్తాపానికి గురైనట్టు చెప్పారు. డిప్రెషన్‌లో ఉన్నానని, ఆత్మహత్య చేసుకునేందుకే ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు మాధురి తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com