Ycp mp: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్

ఏపీ మద్యం పాలసీ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో శనివారం ఆయనను దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించాక అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మిథున్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది. చివరికి సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఊరట లభించలేదు.
జగన్ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం ముసుగులో ‘వైకాపా ముఠా’ సాగించిన దోపిడీకి కుట్ర, అమలుకు ఏర్పాట్లు, ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేయటంలో మిథున్‌రెడ్డిదే ‘మాస్టర్ మైండ్’ అని సిట్ దర్యాప్తులో గుర్తించింది. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కెసిరెడ్డితో కలిసి హవాలా నెట్‌వర్క్ రూపొందించటంలో, వారు వసూలు చేసిన మొత్తాల్ని ‘బిగ్‌బాస్’కు చేర్చటంలో ఆయనే కీలక పాత్ర పోషించారని తేల్చింది. పలు డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని సొంత బ్రాండ్ల మద్యం తయారు చేయించి లబ్ధి పొందటమే కాకుండా, ముడుపుల సొత్తులో ప్రతి నెలా రూ.5 కోట్ల చొప్పున వాటాగా పొందారని దర్యాప్తులో వెల్లడైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com